నాటి మహనీయుని నేటి మంచి మాట
🙏🏻 శుభోదయం 🌅
-----------------
మహనీయుని మాట
--------------------------
దయాగుణం సత్యం పరస్పరం
కలిసే ఉంటాయి.
అలాగే....!
ధర్మం, శాంతి ఒకదానికొకటి
పెనవేసుకుని ఉంటాయి.
- మహాత్మా గాంధీజీ
----------------------------------------
🌷 నేటి మంచిమాట 🎋
:::::::::::::::::::::::::::::::::::::::::::::
కాలం మన చేతిలో లేదు....
కానీ!
నువ్వు నీ చేతిలో ఉంటావు
అది గుర్తు పెట్టుకో.....!!
🙏🏻 శుభోదయం 🏖
--------------
మహనీయుని మాట
--------------------------
ధనం లేదని ఏ పని
చేయని వారు,
ఏం చేయాలన్నా డబ్బు
కావాలనేవారు
ఈ ఇద్దరి విషయంలో చాలా
జాగ్రత్తగా వ్యవహరించాలి.
- బఫెట్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 నేటి మంచిమాట 🌴
:::::::::::::::::::::::::::::::::::::::::::::
"నీకు చదవడం
తెలియాలే గాని
ప్రతి మనిషి ఓ పుస్తకమే"
🙏🏻 శుభోదయం 🌅
---------------
మహనీయుని మాట
--------------------------
నువ్వు ఎంత ఇస్తున్నావనేది
కాదు...
ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది
ముఖ్యం....
- మదర్ థెరిసా!
----------------------------------------
🎋 నేటి మంచిమాట 🌸
----------------------------------------
జీవితంలో అతిపెద్ద అపరాధం
" ఇంకొకరి కంట్లో కన్నీరు......
మనవల్ల రావడం"
జీవితంలో అతిపెద్ద ఉప లబ్ది
"ఇంకొకరి కంట్లో కన్నీరు
మన కోసం రావడం"
తేడా తెలుసుకోండి మిత్రమా!
🙏🏻 శుభోదయం 🌴
---------------
మహనీయుని మాట
-------------------------
ఙ్ఞానానికి గొప్ప శత్రువు
అఙ్ఞానం కాదు..
ఙ్ఞానానికి సంబంధించిన
" *భ్రమ*"
-స్టీవెన్ హాకింగ్
----------------------------------------
🌹 నేటి మంచిమాట 🌿
----------------------------------------
A.B.C.D లలో అన్నీ అక్షరాలు
వంగి ఉంటాయి
కానీ! *"I"* మాత్రం వంగదు
ఎందుకంటే
*"I"* అంటే నేను అనే *అహం*
🙏🏻 శుభోదయం 🌻
----------------
మహనీయుని మాట
----------------------------
*"విద్య లేని శక్తి దండుగ"*
*"శక్తి లేని విద్య నిరుపయోగం"*
- మహాత్మాగాంధీ!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌷 నేటి మంచిమాట 🦚
:::::::::::::::::::::::::::::::::::::::::::::
జీవితంలో ఎవ్వడిని
" నా"
అని గుడ్డి గా నమ్మకు.....!!
నిజాయితీగా బ్రతకడానికి
ఇది మన తాతలు బ్రతికిన
రాతి యుగం కాదు!
కల్తీ " మనుషులు "
బతుకుతున్న "కలియుగం"
ఇది!!
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
---------------------------
*మనలో నిజాయతీ*
*ఉన్నప్పుడు*
*అది మన ముఖంలో*
*ప్రతిబింబిస్తుంది*
- ఆల్ ఫ్రెడ్ టెన్నిసన్ !
----------------------------------------
🌿 నేటి మంచిమాట 🌹
----------------------------------------
అతిగా అరవడం వల్ల
మాట విలువ
అనవసరంగా ఏడవడం వల్ల
కన్నీటి విలువ తగ్గుతాయి.
🙏🏻 శుభోదయం 🎋
----------------
----------------------------
మహనీయుని మాట
----------------------------
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో
దలచినవారు
తమ స్వేచ్చా స్వాతంత్ర్యాలను
ఎంతటి మహాత్ముల పాదాల
వద్దనైనా సరే వదులు కోరాదు
- అంబేడ్కర్
----------------------------------------
🌲 నేటి మంచిమాట 🌴
----------------------------------------
మేఘం బరువును
మోయలేనప్పుడు,
వర్షం కురుస్తుంది.
మనసు బాధను
మోయలేనప్పుడు..
కన్నీరు వస్తుంది.
🙏🏻 శుభోదయం ☘️
----------------
మహనీయుని మాట
---------------------------
ఏ వ్యక్తి పవిత్రమైన
ఆలోచనలతో మాట్లాడతాడో
ఎప్పటికీ విడువని నీడలాగా
ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే
ఉంటుంది....!!
- గౌతమ బుద్దుడు!
----------------------------------------
🌷 నేటి మంచిమాట ☔
----------------------------------------
నాణాలు శబ్ధం చేస్తాయి.
కానీ
కరెన్సీ నోట్లు నిశ్శబ్ధంగా
ఉంటాయి.
నీ విలువ పెరిగినప్పుడు
మాట్లాడటం తగ్గించు
మిత్రమా!
🙏🏻 శుభోదయం 🌸
----------------
మహనీయుని మాట
----------------------------
ఎంతటి కాళ రాత్రిలో నైనా
గంటకి ఉండేది
" అరవై "నిమిషాలే!
కనుక మనసు చతికిలపడ
కూడదు!!
- ఎడ్మండ్ బర్క్ !
----------------------------------------
🦚 నేటి మంచిమాట 🌹
----------------------------------------
ఇద్దరు కలిస్తే లోకంలోకి
వచ్చావు!
నలుగురు మోస్తే ఈ లోకం
విడిచి వెళ్ళావు.!
ఆ ఇద్దరికీ కష్టం అనిపించకు
ఆ నలుగురికి ఇష్టం
అనిపించుకో!!
🙏🏻 శుభోదయం 🦋
-----------------
మహనీయుని మాట
----------------------------
చెడ్డవారితో స్నేహం
ఎప్పటికైనా ముప్పు తెస్తుంది.
- రమణ మహర్షి!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌸 నేటి మంచిమాట 🌴
::::::::::::::::::::::::::::::::::::::::::::
ప్రతి వ్యక్తి స్వభావం నోట్లో
నాలుక మీదే ఆధారపడి
ఉంటుంది.
తెలుసుకోవాలనుకుంటే
తనని మాట్లాడనివ్వాలి.
🙏🏻 *శుభోదయం* 🌞
---------------------------
మహనీయుని మాట
----------------------------
"అధర్మము చేసే వ్యక్తి
తను కూడా ధర్మమే
చేస్తున్నాను అనుకుంటాడు....
ధర్మము గురించి పూర్తిగా
తెలియనంతకాలం ...!"
- జగ్గి వాసుదేవ్
----------------------------
🌴 *నేటి మంచి మాట*🦜
----------------------------
"ఆపదలో ఉన్నవారికి
సహాయము చేయడం కానీ,
బాధను పంచుకోవడం కానీ
ఒక యజ్ఞంతో సమానమే...!"
🙏🏻 శుభోదయం 🌲
----------------
మహనీయుని మాట
----------------------------
నీవు జీవితంలో అభివృద్ధి
చెందాలంటే....
నిత్యం నూతన మార్గాలు
అన్వేషించాలి.
- రాబర్ట్ అంథోని!!
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌷 నేటి మంచిమాట 👳🏻♀
::::::::::::::::::::::::::::::::::::::::::::
మనమెప్పుడూ
రేపు బాగుండాలని
ఈ రోజు పని చేస్తాం
తీరా రేపు వచ్ఛినప్పుడు
ఆనందించడానికి బదులుగా,
మనం మళ్ళీ రేపటి గురించి
ఆలోచిస్తాం కాబట్టిఈ రోజును
ఆనందంగా
గడిపేద్దాం.
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
---------------------------
పదునైన ఆయుధం కంటే
క్షణ కాలంలో వచ్చే కోపమే
అత్యంత ప్రమాదకరం.
- రామకృష్ణ పరమహంస
:::::::::::::::::::::::::::::::::::::::::::::
💐 నేటి మంచిమాట 🎋
:::::::::::::::::::::::::::::::::::::::::::::
సమాజంలో మార్పు ఎందుకు
రాదంటే......?
పేదవారికి "దైర్యం" లేక!
మధ్య తరగతీ వారికి
" సమయం" లేక!
ధనవంతులకు "అవసరం"
లేక!!
🙏🏻 శుభోదయం 🦋
----------------
మహనీయుని మాట
--------------------------
గెలుపు గురించి అతిగా
ఆలోచించవద్దు!
వచ్చిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకో
చాలు......!!
- అబ్రహం లింకన్
::::::::::;::::::::::::::::::::::::::::::::::
🌹 నేటి మంచిమాట 🌴
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఎవరో ఎందుకు రావాలి?
కష్టమొస్తే ఏడవడానికి
" కళ్ళు"
కన్నీళ్లొస్తే తుడవడానికి
" చేతులు"
ఇచ్చాడుగా దేవుడు
" నీకు నువ్వే ఓదార్చుకో"
🙏🏻 *శుభోదయం* 🌅
-----------------
*మహనీయుని మాట*
--------------------------
"పగని తలచుకొని
పెంచుకుంటూ పోతే
మనలోవున్న మంచి గుణాలు
మరుగునపర్చుకొని
చివరకు యుద్ధం కూడా
చేయవలసి వస్తుంది..!"
--షిర్డీ సాయి బాబా
---------------------------------
🦢 *నేటి మంచి మాట* 🦜
----------------------------------
"తల్లిదండ్రులను పూజించలేని
వాడు ఎన్ని పూజలు చేసినా
వ్యర్థమే...!"
🙏🏻 శుభోదయం 🌻
----------------
మహనీయుని మాట
-------------------------
జీవితం ఒక పాఠశాల వంటిది.
ఇక్కడ ప్రతిబాధ....
ప్రతి హృదయ విదారకత
మనకు అమూల్యమైన పాఠాల్ని
నేర్పుతాయి.
- స్వామి వివేకానంద
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌴 నేటి మంచి మాట 🌸
:::::::::::::::::::::::::::::::::::::::::::::
నాకు నేనే ప్రశ్న..
నాకు నేనే సమాధానం
నాకు నేనే ధైర్యం
ఎన్నోసార్లు బాధ
కొన్నిసార్లు సంతోషం
ఇదే!
నా జీవితం.......!!!
🙏🏻 శుభోదయం 🌻
---------------
మహనీయుని మాట
----------------------
ద్వేషాన్ని దూరం చేయ గలిగేది
*ప్రేమ* ఒక్కటే! ద్వేషం కాదు!
- బుద్దుడు!
----------------------------------------
🌹 నేటి మంచిమాట 🌲
----------------------------------------
ఇతరులు ఏమి చేస్తే మనకు
బాధ కలుగుతుందో
ఆ పనిని మనం ఇతరులకు
చేయకపోవడమే ధర్మం!
🙏🏻 శుభోదయం 🌻
------------------
మహనీయుని మాట
---------------------------
మనసు చెప్పినట్టు మనం
వినడం కాదు!
మనం చెప్పినట్టు మనసు
వినేలా చేసుకోవాలి!
- గౌతమ బుద్దుడు!
----------------------------------------
🌹 నేటి మంచిమాట 🤡
----------------------------------------
అవసరమనుకుంటే......!
"కాలాన్ని" అమ్ముకో
" కష్టాన్ని" అమ్ముకో
" ఆస్తీ"ని అమ్ముకో
" అంతస్తు" అమ్ముకో
" తెలివిని" అమ్ముకో
ఎంత ఆపద వచ్చినా....
వ్యక్తిత్వాన్ని మాత్రం
అమ్ముకోకు.....!!
🙏🏻 శుభోదయం 🙏🏻
----------------
మహనీయుని మాట
----------------------------
ఇంతవరకు గాల్లో మేడలు కట్టి
ఉంటే ...
వాటిని అలాగే ఉండనివ్వు!
కానీ
ఇప్పటికైనా వాటి కింద పునాది
నిర్మించడం మొదలు పెట్తు..!
- జార్జ్ బెర్నాండ్ షా
----------------------------------------
👳🏻♀ నేటి మంచిమాట 👳🏻♀
---------------------------------------
డబ్బు ఉన్నవాడి వెనుక
పది మంది ఉంటే వాడు
గొప్పోడు కాదు!
ఏమి లేని వాడి వెనుక
పది మంది ఉంటే వాడు
గొప్పవాడు!!
🙏🏻 శుభోదయం 🙇♂️
------------------
🙏🏼 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏼
------------------------
మహనీయుని మాట
----------------------------
పట్టుదల ఉంటే సరిపోదు
దానికితగ్గ కృషి ఉంటేనే
లక్ష్యసాధన సాధ్యం
- ఐన్ స్టీన్ !
----------------------------------------
🎋 నేటి మంచిమాట 🦢
----------------------------------------
జీవితం సుదూరపు ప్రయాణం
అందరం కూడా బహుదూరపు
బాటసారులమే!
ఎప్పుడైనా మంచి జరిగితే
వేడుక చేసుకుని ముందుకు
సాగిపో...
చెడు జరిగితే మరిచిపోయి
ముందుకు కొనసాగించు
అసలేం జరగలేదనుకో
అయినప్పటికీ అడుగులు
ఆపకుండా ముందుకు వేయ్
ఏదో ఒకటి తప్పక
జరుగుతూనే ఉంటుంది
ఏం జరిగినా ఎడతెగని
ప్రయాణం మాత్రం ఆపవద్దు!
🙏🏻 శుభోదయం 🌅
--------------
మహనీయుని మాట
--------------------------
డబ్బు తప్ప ఇతరత్రా ఏమి
లేనివాడే..
ప్రపంచంలో అందరికంటే
నిరుపేద.....!!
-ఫ్రాన్సిస్ బేకన్
----------------------------------------
🌻 నేటి మంచిమాట 🌲
----------------------------------------
మంచిది.. చెడ్డది.... అని
ఏ రోజు పేరు తగిలించుకుని
రాదు...!
రోజు మంచిగా మారాలన్నా
చెడ్డగా మారాలన్నా
నీ ఆలోచనలే కారణం
ఏం జరిగినా పాజిటివ్ గా
ఆలోచిస్తే......
ప్రతి రోజు మంచిదే.....!!
🙏🏻 శుభోదయం 🤹♂
----------------
మనిషి ఙ్ఞానం కోసం
అన్వేషించాలి తప్ప..
ఙ్ఞానం అతని కోసం
అన్వేషించదు...!!
- పాస్కల్ !
---------------------------------------
🎋 నేటి మంచిమాట 🏵
----------------------------------------
నీకు విలువ లేని చోట
నీ నిజం గెలవదు.
నీకు నువ్వు నిలదొక్కుకున్న
చోట
నీ అబద్దం సైతం
చిందులేస్తుంది...!!
🙏🏻 శుభోదయం 💐
----------------
మహనీయుని మాట
----------------------------
నేరం చేసిన వాడిని శిక్షించడమే
ప్రధానం కాదు.
ఆ నేరం చేయడానికి
ఏ పరిస్ధితులు అతడిని
పురికొల్పాయో వాటిని
తొలగించడం ప్రధానం.....!!
- ఎం.ఎన్ .రాయ్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 నేటి మంచిమాట 🦜
::::::::::::::::::::::::::::::::::::::::::::
ఒక్క "అమ్మ" పది మంది
పిల్లల్ని పెంచగలదు.....
కానీ!
పది మంది పిల్లలు ఉన్న గాని
ఒక్క "అమ్మ"ను పెంచలేక
పోతున్నారు!!
🙏🏻 శుభోదయం 🙏🏻
--------------
మహనీయుని మాట
---------------------------
కోపం తెలివి తక్కువతనంతో
ప్రారంభమై
పశ్చాతాపంతో అంతం
అవుతుంది!!
- ఫైథాగరన్ !
----------------------------------------
🦋 నేటి మంచిమాట 🦋
----------------------------------------
"స్నానం"
దేహాన్ని శుద్ది చేస్తుంది.
"ధ్యానం"
బుద్దిని శుద్ది చేస్తుంది.
"ప్రార్ధన"
ఆత్మను శుద్ది చేస్తుంది.
"దానం"
సంపాదనను శుద్ది చేస్తుంది
"ఉపవాసం"
ఆరోగ్యాన్ని శుద్ది చేస్తుంది.
"క్షమాపణ"
సంబంధాలను శుద్ది చేస్తుంది
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
---------------------------
చేసిన తప్పు చిన్నదిగానో
పెద్దదిగానో కనిపించేటట్టు
చేసుకోవడం అనే రెండురకాల
ప్రమాదాలు మానవజాతిని
పీడిస్తున్నాయి!!
- మేరీ బేకర్
----------------------------------------
🌹 నేటి మంచిమాట 👳🏻♀
----------------------------------------
రాసిన అక్షరం తప్పయితే
దాని దిద్దొచ్చు...! కానీ
జీవితమే తప్పయితే దాన్ని
దిద్దడం చాలా కష్టం......!!
అందుకే
మీ జీవితంలో వేసే ప్రతి
అడుగుని
ఆచి తూచి వేయండి
🙏🏻 శుభోదయం 🏖️
----------------
మహనీయుని మాట
----------------------------
ఏదైనా పనిలో లీనమైనప్పుడు
ప్రపంచంలోని ఏ విషయం నీలో
చొరబడకూడదు,
కానీ! చాలామంది వినోదసమయాల్లో
కూడా
దీనిని పాటించలేరు!!
- చార్లెస్ కింగ్స్ లే
----------------------------------------
🎋 నేటి మంచిమాట ♟️
----------------------------------------
చాలా అన్యాయం కదా ఇది
20 ఏళ్ళు ఎంతో గారాబంగా
కూతురిని పెంచుతారు...
తను ఏం కావాలన్నా
కాదనకుండా లేదనకుండా
తెస్తారు....!
అదే అమ్మాయి పెళ్ళి తర్వాత
తల్లిదండ్రులకు చిన్న సహాయం
చేయాలన్నా.....
భర్త అనుమతి కావాలి!!
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
--------------------------
తనకంటే చిన్నవారిని
ఆరాధించడం ద్వారా ఒక పెద్ద
మనిషి తన గొప్పతనాన్ని
ప్రదర్శిస్తాడు!!
- థామస్ కార్లయిల్
----------------------------------------
🎻 నేటి మంచిమాట 🎻
----------------------------------------
కడుపు నిండిన వాడికి పెట్టిన
" అన్నం"
సముద్రంలో కురిసిన "వర్షం"
ధనవంతుడుకి ఇచ్చిన
" బహుమానం"
పగలు వెలుగుతున్న "దీపం"
బంధానాలు లేని "బంధం"
అసమర్ధులతో "వ్యాపారం"
హద్దులు లేని "స్నేహం"
నిజాయితీ లేని "ప్రేమ"
వ్యర్ధం..,వ్యర్ధం... వ్యర్ధం....!
🙏🏻 శుభోదయం 🌄
----------------
మహనీయుని మాట
------------------------
మంచి పనులు చేయాలి గాని
వాటి గురించి పగటి కలలు
కంటూ కాలం
వెళ్ళబుచ్చకూడదు!!
- చార్లెస్ కింగ్ స్లే!
----------------------------------------
🏹 నేటి మంచిమాట 🏹
----------------------------------------
ఈ రోజే చివరిరోజు
అన్నట్టుగా
జీవితాన్ని పూర్తిగా జీవించండి
ఎప్పటికీ నిలిచి ఉండాలి
అనుకునేంతగా
ఙ్ఞానాన్ని ఆర్జించండి!!
🙏🏻 శుభోదయం 🗼
-----------------
మహనీయుని మాట
----------------------------
చిరకాలం జీవించాలని
అందరూ కోరుకుంటారు
కానీ!
ముసలి వారు అవుదామని
ఎవరూ అనుకోరు!
- ఙౌనాథన్ స్విప్ట్
----------------------------------------
🌸 నేటి మంచిమాట 🌸
----------------------------------------
" కోపం"........ " అసహనం"
నిన్ను ఏ విషయాన్ని సరిగా
అర్ధం చేసుకోనివ్వవు.
సరైన నిర్ణయం
తీసుకోనివ్వవు
కాబట్టి ఈ రెండూ వదిలేసి
చూడు....
నీ జీవితం ఆనందమయం
అవుతుంది!!
🙏🏻 శుభోదయం 🌄
------------------
మహనీయుని మాట
----------------------------
ఇతరులలో మంచిని
చూడకపోవడం..
మనలో మంచితనం
లేకపోవడాన్నే సూచిస్తుంది..!!
- టోట్బింగ్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌻 నేటి మంచిమాట 👮♀️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
కష్టం కన్నీళ్ళనే కాదు
నిజాలను బయటకు రప్పిస్తుంది
- దాపరికాల ముసుగును
తొలగిస్తుంది
- వాస్తవాలను వెలుగు చూసేలా
చేస్తుంది
- కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే
- నీలోని దైర్యాన్ని, సామర్ధ్యాన్ని
నీకు తెలియజేస్తుంది.
- నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా
కష్టం నీకు గుర్తు చేస్తుంది
- కష్టానికి భయపడితే బ్రతుకు
నాశనం
- కష్టాన్ని సవాలుగా తీసుకుంటే
*నీవే ఓ సందేశం! నీవే ఓ*
*ఆదర్శం*.
🙏🏻 శుభోదయం 🛕
-----------------
మహనీయుని మాట
---------------------------
ఈ రోజు నుంచి
ఇరవై సంవత్సరాల తర్వాత
నువ్వు చేసిన పనుల గురించి
కాకుండా చేయలేని పనుల
గురించి ఆలోచించి
బాధపడతావు....!
*అందుకే నచ్చినవన్నీ*
*చేసేయాలి*!,
- మార్క్ ట్వెయిన్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌻 నేటి మంచిమాట 🚜
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఆపదకి సంపద నచ్చదు
సంపదకు బంధం నచ్చదు
బంధానికి బాధ నచ్చదు.
బాధకు బ్రతుకు నచ్చదు
బ్రతుకికి చావు నచ్చదు
చావుకు పుట్టుక నచ్చదు
కానీ.....!!
అన్నీ అనుభవించాలి.
అదే జీవితం!!
🙏🏻 శుభోదయం ✡️
---------------
మహనీయుని మాట
--------------------------
తన వైపు ఇతరులు విసిరే
రాళ్ళతో తన ఎదుగుదలకు
పునాదులు వేసుకునే వాడే
తెలివైన వ్యక్తి!!
- డేవిడ్ బ్రింక్ లీ!
---------------------------------------
🌲 నేటి మంచిమాట 💺
---------------------------------------
పేదవాడికి ఏమి లేకపోయినా
భగవంతుడు ఉన్నాడని
ధైర్యంతో బ్రతుకుతాడు!
బాగా ఉన్నవాడు ఈ ఆస్తిపోతే
నేనెలా బతకాలి అనే
భయంతోనే చస్తాడు!
🙏🏻 శుభోదయం ⚛️
----------------
మహనీయుని మాట
---------------------------
సక్సెస్ సాధించేందుకు
ఓ మంచి ఫార్ములా అయితే
నేను చెప్పలేను. కానీ ఓటమికి
మాత్రం ఓ ఫార్ములా ఉంది.
ఎల్లప్పుడూ అందరికి నచ్చేలా
ఉండాలనుకోవడమే
ఆ ఫార్ములా........!!
- హెర్బర్ట్ బయార్డ్ స్వో ప్
----------------------------------------
🎋 నేటి మంచిమాట 🏵️
----------------------------------------
దేశం గెలవాల్సింది
స్టేడియంలో కాదు పచ్చనిపంట
పొలాల్లో......
వికెట్ పడితే దేశం ఓడి
పోతుందనే దేశ భక్తులారా!
దేశానికి అన్నం పెట్టే రైతు
దేహాలెన్నోపడిపోతున్నాయి
100 పరుగులు చేయాలని
దేవుని మొక్కుతున్నావు కదా!!
నీకు తెలిసిన రైతు వంద
బస్తాలు పండించాలని కోరుకో!!
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
--------------------------
తనతో తాను
ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి
శత్రువులే ఉండరు !!
- బెంజిమన్ ఫ్రాంక్లిన్
----------------------------------------
🌹 నేటి మంచిమాట ⛱️
----------------------------------------
డబ్బుతో నువ్వు ఇల్లు
కొనవచ్చు....
కానీ కుటుంబాన్ని కాదు!
డబ్బుతో నువ్వు గడియారం
కొనవచ్చు....!!
కానీ సమయాన్ని కాదు.
డబ్బుతో నువ్వు పరుపు
కొనవచ్చు....!!!
కానీ నిద్రను కాదు
డబ్బుతో నువ్వు పుస్తకాన్ని
కొనవచ్చు......!!!!
కానీ ఙ్ఞానాన్ని కాదు.
డబ్బుతో నువ్వు పదవిని
కొనవచ్చు...!!!!!
కానీ గౌరవాన్ని కాదు!
🙏🏻 శుభోదయం 🕉️
---------------
మహనీయుని మాట
--------------------------
సంతోషంగా ఉండే వ్యక్తులంటే
ఎక్కువ పొందే వాళ్ళు కాదు.
*ఇతరులకు ఎక్కువగా*
*ఇచ్చేవాళ్ళు*!
- జాక్సన్ బ్రౌన్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 🕰️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది..
*క్రమశిక్షణ తప్పరాదు* అని...
ప్రతి తోటలో రాసి ఉంటుంది
*పువ్వులు కొయ్యరాదు* అని..
ప్రతి ఆటలోను రాసి ఉంటుంది
*నియమాలు తప్పరాదు* అని..
అలాగే!
ప్రతి మానవ సంబంధం లోనూ
రాసి ఉంటే బాగుండేది ఏమో!
*స్వార్ధంతో ఎవరి మనసుతో*
*ఆడుకోరాదు అని*....!!
🙏🏻 శుభోదయం 🔔
-----------------
మహనీయుని మాట
---------------------------
నువ్వు కేవలం ఒక్కసారే
జీవిస్తావు.....!
కానీ
*ఆ జీవితంలో నువ్వు సరైన
*పనులు చేస్తే*
ఒక్కసారి జీవించినా చాలు....!!
- మేవెస్ట్ !
----------------------------------------
⛵ నేటి మంచిమాట 🌲
----------------------------------------
ఉన్నదంతా పోయినా కూడా
నువ్వింకా ధనవంతుడివే.....
ఎందుకంటే......!!
*బంగారం లాంటి సమయం*
*ఇంకా నీ చేతుల్లోనే ఉంది*!!
🙏🏻 శుభోదయం 🌆
---------------
మహనీయుని మాట
---------------------------
విజయం సాధించిన వ్యక్తిగా
కాదు,
విలువలు కలిగిన వ్యక్తిగా
ఎదగడానికి ప్రయత్నించు.
. - ఆల్బర్ట్ ఐన్ స్టైన్
----------------------------------------
🎋 నేటి మంచిమాట ⛽
---------------------------------------
బాధలు అనేవి గాలిలాంటివి
అవి లేని చోటంటూ ఏదీలేదు
నీ ఒక్కడికే
బాధలు ఉన్నట్టు తెగ బాధ
పడకు...
చాలా మంది అందులోనే ఉండి
ఈత కొడుతున్నారని
తెలుసుకో మిత్రమా!
🙏🏻 శుభోదయం 🚒
----------------
మహనీయుని మాట
----------------------
అఙ్ఞానం కన్నా *నిర్లక్ష్యం*
ఎక్కువ *కీడు* చేస్తుంది.!
-ఫ్రాంక్లిన్ !
-------------------------------------
☘️ నేటి మంచిమాట 🍿
-------------------------------------
వాగేవాడితో "సీక్రెట్ "
చెప్పకూడదు...!
వాదించేవాడితో
ఆర్గ్యుమెంట్ చేయకూడదు
తెలివైనవాడితో పోటీ
పడకూడదు...
తెగించినవాడితో తల
పడకూడదు..!!
🙏🏻 శుభోదయం 🎆
-----------------
మహనీయుని మాట
--------------------------
పోరాడితే పోయేదేమి లేదు
బానిస *సంకెళ్లు* తప్ప!
- కార్ల్ మార్క్స్
----------------------------------------
🌹 నేటి మంచిమాట ☂️
----------------------------------------
"నిప్పు, అప్పు, పగ"
ఈ మూడూ తమంతట తాము
తరగవు....
పెరుగుతూనే ఉంటాయి.
అందుకే నిప్పును ఆర్పాలి,
అప్పును తీర్చేయాలి,
పగను సమూలంగా
తుంచేయాలి
వీటిని ఏమాత్రం మిగిల్చినా
వృద్ది చెందుతాయి!!
🙏🏻 శుభోదయం ♥️
-------------
మహనీయుని మాట
---------------------------
మతమనేది ఒక రకమైన
ఆధ్యాత్మిక అణచివేత
ప్రజల పట్ల మత్తు మందు
- వి.ఐ.లెనిన్
----------------------------------------
🌹 నేటి మంచిమాట 🛎️
----------------------------------------
చక్కగా జీవించి బ్రతికే వారికి
చివాట్లు ఎక్కువ
నవ్విస్తూ ఉండే వారికి
బాధలు ఎక్కువ
నమ్మినవారికే మోసాలుఎక్కువ.
🙏🏻 శుభోదయం 🌌
---------------
మహనీయుని మాట
-----------------------
మానవ జాతి గతిని
నిర్ణయించేది ఆర్ధిక పరిస్ధితులే
కాని
రాజకీయ,మత, సాంసృతిక
పరిస్ధితులు కావు
- కార్ల్ మార్క్స్
--------------------------------------
🌻 నేటి మంచిమాట 🦜
--------------------------------------
నా జీవితం గొప్పది అని
ఎప్పుడు గర్వపడకు!
మనిషి జీవితంలో అదృష్టం
అనేది...
ఎంత కాలం ఉంటుందో
చెప్పలేం!....... కాని
జీవితంలో ఏదో ఒక రోజు
చావాలా? బతకాలా అనే
పరిస్ధితి మాత్రం ఖచ్చితంగా
వస్తుంది...!!
ఆ రోజున నువ్వు పడిన
కష్టాలు నీకు జీవితాంతం గుర్తు
ఉండిపోయేలా చేస్తాయి..!!
జాగ్రత్త!.
🙏🏻 శుభోదయం 💥
-------------
మహనీయుని మాట
-------------------------
*ఙ్ఞానోదయాన్ని కలిగించే*
*మాటలు "ఆభరణాల" కంటే*
*గొప్పవి*!
- బేగం హజరత్ మహల్ --------------------------------------
🪔 నేటి మంచిమాట 🌹
--------------------------------------
మట్టి కలిపితే *ఇటుకగా*
మారింది!
ఇటుకలన్నీ కలిస్తే *గోడలా*
మారింది!!
గోడలన్నీ కలిస్తే *భవనం*
లామారింది!!!
*ప్రాణం లేని వాటికున్న ఐక్యత*
*జీవమున్న మనిషికి లేదు*!
🙏🏻 శుభోదయం 🌄
----------------
-----------------
మహనీయుని మాట
----------------------------
మీరు సూర్యుడిలా వెలగాలి
అనుకుంటే...
ముందు మీరు సూర్యుడిలా
మండటం నేర్చుకోవాలి!
- అబ్దుల్ కలాం
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 😀
:::::::::::::::::::::::::::::::::::::::::::::
అవినీతి మార్గంలో
జీవించే ధనికుడు కన్నా
నిజాయితీగా బతికే
నిరుపేద మేలు!!
🙏🏻 శుభోదయం 🏝️
::::::::::::::::::::::::::::::::::::::::
మహనీయుని మాట
--------------------------
జీవితంలో ఏ కష్టాలు
రాకూడదని ప్రార్ధించకు
ఎలాంటి కష్టాలనైనా
ఎదుర్కోనే శక్తి కావాలని
ప్రార్ధించు.....!!
- బ్రూస్ లీ
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌲 నేటి మంచిమాట 🌷
:::::::::::::::::::::::::::::::::::::::::::::
నీకున్న మంచి మిత్రుడు
ఎవరో తెలుసా.....
" నీ కన్నీళ్లే"
మనసుకు కొంచెం బాధ కలగ
గానే నేనున్నాను అంటూ
ఆత్మీయంగా చెంపలను
తడుముతాయి!!
గుండె బరువు తగ్గే వరకూ
మనం వదలి వెళ్ళమన్నా
అవి మనల్ని విడిచి వెళ్ళవు.
నీ కన్నీరే నీ "ఆత్మీయనేస్తం"..
🙏🏻 శుభోదయం 🔔
------------------
మహనీయుని మాట
----------------------
జీవితంలో సాధ్యం కాని
ప్రయాణం అంటే
అసలు ప్రారంభించనిదే.
ప్రారంభించని పనే
అసాధ్యమనిపిస్తుంది.
- ఆంటోని రాబిన్స్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🎋 నేటి మంచిమాట 🦁
:::::::::::::::::::::::::::::::::::::::::::::
సమస్య అనేది ఒక్కోక్కరికి
ఒక్కోలా ఉంటుంది.
నా సమస్య నీకు సిల్లీగా
అనిపించొచ్చు...!
బట్ నా దృష్టిలో అది నాకు
"పెద్దదే"అయిండొచ్చు.
ఎందుకంటే.....,,!!
అనుభవించే వారికే తెలుస్తుంది
నొప్పి విలువ!!
(నొప్పి కూడా అందరికీ ఒకేలా
ఉండదు)
🙏🏻 శుభోదయం 🌠
-----------------
మహనీయుని మాట
--------------------------
ఈ ప్రపంచం మనిషి అవసరాలు
తీర్చగలదు,
కానీ ...!
కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.
- మహాత్మాగాంధీ!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 🏖️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
నవ్వుతున్నప్పుడు నీళ్ళు
తాగడం ఎంత కష్టమో.......
మనసుకు బాధ కలిగినప్పుడు
కన్నీళ్ళు ఆపటం అంతేకష్టం
🙏🏻 శుభోదయం 🏞️
---------------
మహనీయుని మాట
-----------------------
చిన్నప్పుడు మంచి అలవాట్లు
నేర్చుకుంటే.....!
పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు
సాధించడానికి తోడ్పడతాయి
- జవహర్ లాల్ నెహ్రూ
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 నేటి మంచిమాట 🤩
:::::::::::::::::::::::::::::::::::::::::::::
చేసిన మంచిని మరచిపోయి
మన తప్పులనే చూపించే
సమాజం ఇది!
జాగ్రత్త మిత్రమా...
వెంట ఉంటూనే వెన్నుపోటుని
పరిచయం చేస్తారు!!
🙏🏻 శుభోదయం 💥
-----------------
మహనీయుని మాట
----------------------------
నువ్వు మాట్లాడుతున్నప్పుడు
నీకు తెలిసిందే చెప్పగలవు
కానీ....
నువ్వు వినేటప్పుడు ఏదొ కొత్త
సంగతి తెలుసుకుంటూ
ఉంటావు.......!!
- దలైలామా!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🪔 నేటి మంచిమాట 🪔
:::::::::::::::::::::::::::::::::::::::::::::
వృద్దాప్యం ఎంత
దయనీయమైనదంటే..........!
"ఊరికే తింటూ ఖాళీగా
కూర్చుంటున్నావు"....... అని
గోరు ముద్దలు తిన్న సంతానం
చేత అనిపించుకునేంత!!
🙏🏻 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
------------------------
ఇతరులు చేసిన ఏనుగంత
తప్పును ఆవగింజంత చిన్నగా
చూడు.....!!
నువ్వు చేసిన చిన్న తప్పును
కూడా కొండంత తప్పుగా
భావించు.
- మహాత్మాగాంధీ!
-------------------------------------
☘️ నేటి మంచిమాట ⏰
-------------------------------------
నువ్వు బ్రతికి ఉన్నప్పుడు
ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళు
నువ్వు చచ్చాక నవ్వుకుంటారు.!
నువ్వు బ్రతికి ఉన్నప్పుడు
ఎవరైతే నవ్విస్తారో
వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం
ఏడుస్తారు.......!!
🙏🏻 శుభోదయం 🕉️
---------------
మహనీయుని మాట
------------------
మనస్సును ఆరోగ్యకరమైన
ఆలోచనలతో నింపండి.
అవే జీవితాన్ని సుఖమయం
చేస్తాయి....!!
- విల్ కిన్స్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచిమాట 🛎️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
జీవితంలో అబద్దం చెప్పే
వాళ్ళనైనా క్షమించు గానీ.....!!
అబద్దం చెప్పి ఇదే నిజమని
నమ్మించే వారిని జీవితంలో
క్షమించవద్దు....,!!!
🙏🏻 శుభోదయం 🏨
-----------------
మహనీయుని మాట
-----------------------------
అధైర్యం అనేక అనర్ధాలకి
దారితీస్తుంది.
- జెకోఫాన్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 🐻
:::::::::::::::::::::::::::::::::::::::::::::
పేదవాడు
ధనం కోసం చూస్తాడు
ధనికుడు
స్వర్గసుఖాలకోసం చూస్తాడు
కాని.....!
ఙ్ఞాని..
ప్రశాంతత కోసం చూస్తారు!!
🙏🏻 శుభోదయం 🌄
-----------------
మహనీయుని మాట
-------------------------
గొప్ప గుణాలుంటే సరిపోదు
వాటిని వినియోగించగలగాలి
- అబ్రహం లింకన్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌻 నేటి మంచిమాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో
పద్దతి ఉంటే... వచ్చే సమాధానంలోసంస్కారం
ఉంటుంది.....!!
🙏🏻 శుభోదయం 🌻
------------------
మహనీయుని మాట
----------------------------
కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి
నిజస్వభావం వెల్లడవుతుంది
- ఎం.ఇ.స్పియర్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🏹 నేటి మంచిమాట 🦋
:::::::::::::::::::::::::::::::::::::::::::::
పేదరికం దరిచేరినప్పుడు
ఆప్తమిత్రులు కూడా
దూరమైఫోతారు.
అదే......!
ధనవంతులైనప్పుడు
తెలియని వారు కూడ
మిత్రులవుతారు
🙏🏻 శుభోదయం 🎯
-----------------
మహనీయుని మాట
------------------------
ఎన్నడూ ఆశపడని వాడు
ఎన్నడూ అసంతృప్తికి గురి
కాడు......!!
- బెర్నార్డ్ షా!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🍁 నేటి మంచిమాట 🦅
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఒకరు మరొకరికీ హాని చేస్తుంటే
చూసి నవ్వడం చాలా తేలిక!!
అదేహాని తనకి జరిగితే
భరించడం చాలా కష్టం..!!
🙏🏻 శుభోదయం 🗼
---------------------------------
మహనీయుని మాట
--------------------------------
*విధి నిర్వహణను మించిన*
*దేశసేవ లేదు*.
- మహాత్మాగాంధీ!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 🛤️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
రెచ్చగొట్టే వాళ్ళకు
చిచ్చుపెట్టే వాళ్ళకు
దూరంగా ఉంటే జీవితానికి
మంచిది...!!!
🙏🏻 శుభోదయం 🛕
-----------------
మహనీయుని మాట
-------------------------
రాపిడిలేనిదే రత్నం ప్రకాశించదు
అలాగే, కష్టాలను తట్టుకోలేని
మానవుడు ఏనాటికి పరిపూర్ణత
పొందలేడు
- రామకృష్ణ పరమహంస!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🌻. నేటి మంచిమాట 🏯
:::::::::::::::::::::::::::::::::::::::::::::
డబ్బుతో పైకి వచ్చినవాడు
డబ్బున్న మనిషికే
విలువనిస్తాడు....!
కష్టపడి పైకి వచ్చినవాడు
కష్టపడే ప్రతి మనిషికి
విలువనిస్తాడు.....!!
🙏🏻 శుభోదయం 🏤
------------------
మహనీయుని మాట
---------------------------
మానవతా దృక్పథం లేని
మేధావి
మూర్ఖుని కంటే అధముడు
- రస్సెల్
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🎋 నేటి మంచిమాట 🛺
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఇతరుల క్యారెక్టర్ గురించి
తప్పుగా పబ్లిసిటీ ఇచ్చి
నీ క్యారెక్టర్ ని వేరేవారి
ముందు గొప్పగా చేసుకున్నప్పుడే
నువ్వే నిజమైన క్యారెక్టర్ లేని
వాడవని అర్ధం!!
🙏🏻 శుభోదయం 🚝
------------------
మహనీయుని మాట
---------------------------
ఏమి చేయకుండానే ఎంతోకొంత
పొందాలని ఎదురుచూసే వ్యక్తులు
తప్పనిసరిగా నిరాశకు గురవుతారు.
- జియోర్డ్ ఎలైట్
------------------------------------
🍁 నేటి మంచిమాట ⛵
-------------------------------------
మనం ఆనందంగా ఉన్నప్పుడు
వచ్చి మనం ఇచ్చే ఆతిధ్యం
స్వీకరించే వారికన్నా...
మనం కష్టాల్లో ఉన్నప్పుడు
వచ్చి ఆత్మీయంగా పలకరించే వారే
నిజమైన ఆప్తులు..ఆత్మీయులు,..!
🙏🏻 శుభోదయం 🌻
---------------
మహనీయుని మాట
---------------------
అన్నీ మన మేలుకోసమేనని
తలిస్తే....
ఎలాంటి క్లిష్టపరిస్దితి కూడా
మనసును కలత పెట్టలేదు.
- జెఫర్ సన్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️. నేటి మంచిమాట 🎡
:::::::::::::::::::::::::::::::::::::::::::::
సముద్రంలో వాన కురిస్తే
ప్రయోజనం లేదు.
పగటిపూట దీపం వెలిగితే
ప్రయోజనం లేదు.
ధనవంతునికిచ్చే చిరుకానుక
ప్రయోజనం లేదు.
🙏🏻 శుభోదయం 🍇
----------------
మహనీయుని మాట
-------------------------
మనం తలపెట్టిన కార్యం
మంచిదనే నమ్మకం
మనకున్నప్పుడు
అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ
పట్టించుకోరాదు.....!!
- ఫిలిప్ మానసింగర్
--------------------------------------
🌹 నేటి మంచిమాట ☎️
--------------------------------------
వీరత్వం అనగా ఎదిరించి
నిలబడడమే తప్ప
సందర్భం వచ్చినప్పుడు
వెనుకనుండి వెన్నుపోటు
పొడవడం కాదు...!!
🙏🏻 శుభోదయం 🕉️
------------------
మహనీయుని మాట
-------------------------
శరీరానికి ఆరోగ్యం ఎలాంటిదో
మనస్సుకు విజ్ఞత అలాంటిది.
- స్వామి వివేకానంద
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట ⏲️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
కలుపుకుని పోయే మనస్తత్వం
నీలో ఉంటే..
అందరూ నీతోనే ఉంటారు...
నాకేం పట్టింది,నాకు అనవసరం
నాకెందుకు అనే అహం నీలో
ఉంటే.....
అందరూ దూరమైపోతారు.
🙏🏻 శుభోదయం 🚝
----------------
మహనీయుని మాట
-----------------------------
అలవాట్లు మనం ఉపయోగించే
చేతికర్రవలె ఉండాలి.
కానీ......!
ఆధారపడే ఊతకర్రగా
ఉండకూడదు.....
- ఎ.జి.గార్డెనర్
-----------------------------------
🌹 నేటి మంచిమాట 🏡
------------------------------------
పేరుకి అందరూ బంధువులే
కానీ
సమయం వచ్చినప్పుడు
తెలుస్తుంది.
ఎవరు బంధువులో...
ఎవరు రాబంధులో....
ఎవరు ఆత్మబంధువులో...
🙏🏻 శుభోదయం 🛕
------------------
విజయదశమి శుభాకాంక్షలు
-------------------------------------
మహనీయుని మాట
-------------------------
ఎప్పుడూ ఒక్కరికి ఇవ్వడం
నేర్చుకో...
అంతేకాని తీసుకోవడంకాదు
అలాగే
ఒకరికీ సేవ చేయడంనేర్చుకో
అంతేకాని ఒకరిపైన పెత్తనం
చేయడం కాదు...!!
- రామకృష్ణ పరమహంస
--------------------------------------
🍇 నేటి మంచిమాట 🏆
--------------------------------------
గౌరవం అనేది విలువను బట్టి
ఇవ్వాలి కానీ
డబ్బును చూసి కాదు.
వందలు, వేలు పెట్టి కొనే
మెట్టెలను కాళ్ళకు
పెట్టుకుంటారు.
రూపాయల్లో కొనుక్కునే
కుంకుమని నుదిటిన
పెట్టుకుంటారు.
🙏🏻 శుభోదయం 🏜️
-----------------
మహనీయుని మాట
----------------------------
విద్యాపరమైన పెట్టుబడికి
ఉత్తమం అయిన వడ్డీ
లభిస్తుంది....!!
- బెంజిమన్ ఫ్రాంక్లిన్
------------------------------------
🍁 నేటి మంచిమాట 🚘
-------------------------------------
నమ్మినవారు మోసం చేశారని
అందరి మీద నమ్మకం కోల్పోకు
బొగ్గువల్ల చేతికి మసి అంటిందని..
వజ్రం దొరికితే వదులుకోలేం
కదా......!!
🙏🏻 శుభోదయం 🎰
-----------------
మహనీయుని మాట
-----------------------
పొరపాట్లకు పరిష్కారం
వాటిని మరచిపోవడమే!
- సైరన్ !
-----------------------------------
🌻 నేటి మంచిమాట 🍿
-----------------------------------
గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే
అందమైన సీతాకోకచిలుకలా
మారి పైకి ఎగురుతుంది.....!
అలాగే....!
మనిషి జీవితం కూడా అంతే
కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా
ఉంటే కొత్త జీవితం ప్రారంభం
అవుతుంది....!!
🙏🏻 శుభోదయం 🌅
-----------------
మహనీయుని మాట
----------------------
అంతరంగం అందంగా ఉంటే
ఆచరణ అర్ధవంతంగా
ఉంటుంది.
- బేకన్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☘️ నేటి మంచిమాట 🗼
:::::::::::::::::::::::::::::::::::::::::::::
ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని
ఎప్పుడూ మార్చుకోకు.
సింహం కూడా తన స్వభావాన్ని
వదిలి పిల్లిగా మారితే కుక్కలు
కూడా వెంటపడి కరుస్తాయి.....!!
🙏🏻 శుభోదయం 🌆
----------------
మహనీయుని మాట
----------------------------
గ్రంధాలయాలు ప్రపంచానికి
"కిటికీలు"
గ్రంధాలయాలు లేని ఊళ్ళు
అఙ్ఞానాంధకారకూపాలు!
- చిలకమర్తి!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🏗️ నేటి మంచిమాట 🏗️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
సూర్యుని వెలుతురు పగలు
మాత్రమే దారిచూపుతుంది.
కానీ!
ఆత్మవిశ్వాసం అన్నీ వేళలా
దారి చూపుతుంది.
🙏🏻 శుభోదయం 🏪
---------------
మహనీయుని మాట
------------------------
పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని
కూడా నయం చేయవచ్చు.
కానీ!
అహంకారంతో కళ్ళు మూసుకు
పోయే వారిని ఎవరూ బాగు
చేయలేరు.
- గౌతమ బుద్దుడు!
:::::::::::::::::::::::::::::::::::::::::::::
🏝️ నేటి మంచిమాట 🏝️
:::::::::::::::::::::::::::::::::::::::::::::
వందమంది వంద రకాలుగా
చెబుతారు.
అవన్నీపట్టించుకునిప్రశాంత
తను కోల్పోవద్దు.
నీ అంతరాత్మ చెప్పింది చేయి
ఎందుకంటే?
అది నిన్ను ఎప్పుడూ మోసం
చేయదు...!!
Comments
Post a Comment